భారత్‌ × పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌

India × Pakistan Cricket match– హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు
దుబాయ్: భారత్‌, పాకిస్తాన్‌ జట్లమధ్య జరిగే క్రికెట్‌ మజా అంటే వేరు. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాలు కిక్కిరిసిపోవాల్సిందే. ఈ క్రమంలోనే ఈనెలలో పాకిస్తాన్‌ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్‌ దుబాయి వేదికగా జరుగనుంంది. మ్యాచ్‌ టికెట్ల బుకింగ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయంటే.. ఎంత భారీ క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య గ్రూప్‌ దశ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న జరుగనుంది. చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ మ్యాచులన్నీ దుబాయిలోనే ఆడనున్న విషయం తెలిసిందే. దుబాయి క్రికెట్‌ స్టేడియం జనరల్‌ స్టాండ్‌ టికెట్‌ 125 దిర్హామ్స్‌ (రూ.3వేలు) నుంచి ప్రారంభమైంది. దుబాయిలో జరిగే మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. టోర్నమెంట్‌ 19 రోజుల పాటు కొనసాగుతుంది. రావల్పిండి, లాహోర్‌, కరాచీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతాయి. పాకిస్తాన్‌లోని ప్రతి మైదానంలో మూడు గ్రూప్‌ మ్యాచులు జరుగుతుతాయి. భారత్‌ ఆడే మూడు గ్రూప్‌ మ్యాచ్‌లు, మొదటి సెమీఫైనల్‌ మాత్రం దుబాయిలోనే ఉంటుంది. ఈ ఈవెంట్‌లో టీమిండియా ఫిబ్రవరి 20న తొలి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. 23న పాకిస్తాన్‌తో తలపడనుంది.ర్చి 2న చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది.