పోఖ్రాన్‌లో ‘భారత్‌ శక్తి’ సైనిక విన్యాసాలు

తొలిసారి 'తేజాస్‌'కు ప్రమాదం– గర్జించిన యుద్ధవిమానాలు, యుద్ధట్యాంకులు
జైపూర్‌ : రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్‌ శక్తి’ పేరిట మంగళవారం జరిగిన విన్యాసాలు చూసేవారిని విస్మయానికి గురిచేశాయి. భారత్‌ అమ్ముల పొదిలోని ఎల్‌సిఎ తేజాస్‌, ఎఎల్‌హెచ్‌ ఎంకె-4 వంటి యుద్ధవిమానాలు, అర్జున్‌, కె-9 వజ్ర, థనుష్‌ వంటి యుద్ధట్యాంకులను ఇక్కడ ప్రదర్శించింది. వీటితో చేసిన విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే శరంగ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌, పినాకా శాటిలైట్‌ సిస్టమ్‌, డ్రోన్‌ల సమూహం భారత సైనిక శక్తి చాటి చెప్పాయి. ఈ సైనిక విన్యాసాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత సైన్యం గగనతలంలోనూ, భూమిపై ప్రదర్శించిన పరాక్రమాన్ని ‘న్యూ ఇండియా’గా వర్ణించారు.