ఇండియన్‌ ఆయిల్‌ మరో ‘నయీ దిశ స్మైల్‌’

నవతెలంగాణ – హైదరాబాద్‌
ఖైదీలు, బాల నేరస్తులలో పరివర్తన ప్రయత్నంలో భాగంగా ఇండియన్‌ ఆయిల్‌ ‘పరివర్తన్‌ – ప్రిజన్‌ టు ప్రైడ్‌’ ఎనిమిదో దశను, ‘నయీ దిశ – స్మైల్‌’ ఐదో దశను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఇండియన్‌ ఆయిల్‌ చైర్మెన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య మాట్లాడుతూ.. ఈ దశలో ఇండియన్‌ ఆయిల్‌ 22 జైళ్లు, జువైనల్‌ హోమ్‌లలో వెయ్యి మందికి పైగా వ్యక్తుల జీవితాలను స్పృశించనున్నామని తెలిపారు. ఈ రోల్‌ అవుట్‌తో ఇండియన్‌ ఆయిల్‌ 23 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15 మహిళా బాల్య కేంద్రాలతో సహా 150 సంస్థలలో 7300 మంది ఖైదీలు, బాల్య జీవితాల్లో స్పోర్ట్స్‌ కోచింగ్‌, పరికరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.