– 6.5 టన్నుల సామగ్రితో బయల్దేరిన విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలకు సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. సామగ్రి, ఔషధాలను ఆదివారం గాజాకు పంపించింది. ‘ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీస్, నీటి శుద్ధీకరణ మాత్రలు ఇతర వస్తువులను’ మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్విటర్‌లో(ఎక్స్)లో పోస్టు పెట్టారు. భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ సీ-17 విమానంలో మొత్తం 6.5 టన్నుల సామగ్రి వెళ్తోందని చెప్పారు. ఈ సామగ్రిని తొలుత ఈజిప్టులోని ఈఎల్-అరిష్ విమానాశ్రయానికి చేరుస్తారు. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారని తెలిపారు.