ఇందిరా మహిళా శక్తి లక్ష్యాలు పూర్తి చేయాలి

Indira Mahila Shakti goals must be fulfilled– సమీక్ష సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి
నవతెలంగాణ – సిరిసిల్ల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ఇందిరా మహిళా శక్తి లక్ష్యాలను పూర్తి చేసేలా, లబ్ధిదారులకు చేరవేయాలని డిఆర్డిఓ శేషాద్రి పిలుపు  నిచ్చారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమాఖ్య భవనంలో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ శేషాద్రి మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి లో భాగంగా  ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, మైక్రో ఎంటర్ప్రైజెస్, స్కూల్ యూనిఫార్మ్స్, మీసేవ కేంద్రాలు , పెరటి కోళ్ల పెంపకం, మదర్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ , మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు, మిల్క్ పార్లర్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలపై సిబ్బంది సిబ్బందితోనే సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో అడిషనల్ డిఆర్డిఓ గొట్టే శ్రీనివాస్, డిపిఎంలు ఏబీఎన్ లు మరియు సీసీలు పాల్గొన్నారు.