మాదిగల అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇందిరాను గెలిపించాలి..

నవతెలంగాణ-ధర్మసాగర్
మాదిగల అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇందిరను గెలిపించాలని, నియోజకవర్గంలోని మాధిగలందరు ఏకతాటిపైకి రావాలని స్టేషన్ ఘన్పూర్ ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షులు సింగపురం దయాకర్ అన్నారు.సోమవారం మండలంలోని తాటికాయల గ్రామంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 80 వేల పై చీలుక ఓట్లు ఉన్న మాదిగ సామజిక వర్గాన్ని రాజకీయకంగా అనుగదొక్కేందుకు కుట్రలు జరిగాయని ప్రధాన పార్టీలు ఐన బీఆర్ఎస్, బీజేపీ లు మాదిగలకు  టికెట్ ఇవ్వకుండా మనల్ని మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కులాలు వారు వారి అస్థిత్వాన్ని కపాడుకోవడం కోసం ఏకతాటిపైకి వస్తున్న సందర్బంలో మన మాదిగలు అందరూ ఏకతాటి పైకి వచ్చి, మన మాదిగ జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాదిగల ముద్దు బిడ్డ “సింగపురం ఇందిరా” గారిని గెలిపించేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. ఇందిరా గెలుపు మన మాదిగల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ,నా మాదిగ జాతి పెద్దలు అందరూ కూడా ఆలోచించలని ఆయన విజ్ఞప్తి చేసారు. మన అస్థిత్వాన్ని కాపాడుకోవాలిసిన భాద్యత మన అందరిపై ఉందని దయాకర్ అన్నారు..ఈ కార్యక్రమంలో మతాంగి కుమార్, మారపక శేఖర్,ఎర్ర సంపత్ ,గుర్రం కిషోర్, సింగపురం మద్దెష్ తదితరులు పాల్గొన్నారు.