– హుస్నాబాద్ లో 4542 దరఖాస్తులు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్మన్ ఆకుల రజిత అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్మన్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు కావాలని ప్రజా పాలనలో 4542 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 26 మంది సర్వేయర్స్ ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సర్వే జరిపిస్తామన్నారు. వార్డ్ ఆఫీసర్ లు సర్వేలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇల్లు వచ్చే విధంగా సర్వే చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్స్ నళిని దేవి, బోజు రమాదేవి, స్వర్ణలత, భాగ్య రెడ్డి, లావణ్య, పద్మ, వేణు, ఎం శ్రీనివాస్, రవి, డి శ్రీనివాస్, జి రాజు, కల్పన, సరోజన, రత్న మాల,వి రాజు, రమేష్, హరీష్ , సుప్రజ కమిటీ సభ్యులు, వార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.