నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్రంలో నిరు పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశాకే ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపి మల్లేష్ శనివారం ఒక ప్రకటనలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరి చేస్తామని అంటునే మరొ మాట రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు వుంటేనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరి చేయాలనే పునరాలోచన సీఎం రేవంత్ రెడ్డి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడం కాయమని అన్నారు.