– పీసీసీ అధ్యక్షుడికి ఫూలే అంబేడ్కర్ నగర్ ప్రజలు విజ్ఞప్తి
నవతెలంగాణ కంఠేశ్వర్
పులే అంబేడ్కర్ నగర్ ప్రజలు పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఈ మేరకు గురువారం బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ శివారు ప్రాంతమైన గిరిరాజ్ కాలేజీ పక్కనగల సర్వే నెంబర్ 168లో గల ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగల ఫూలే అంబేడ్కర్ నగర్ బస్తీ ప్రజల నుండి వినతి పత్రం తీసుకున్న అనంతరం శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటి సభ్యులు దడ్వాయి స్వామి, కిషోర్, స్వాతి, చంద్ర గౌడ్, శాంత బాయి, రాధా, లక్ష్మి,ఉషా, వాణి, రేఖా,రాధా బాయి, సూర్య వంశీ శాంత బాయి లు పాల్గొన్నారు.