ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మంజూరు అయ్యేలా పక్కా పర్యవేక్షణ చేపట్టాలి…

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు  గ్రామాలలో స్వీకరించిన  ఎల్-1, ఎల్-2, ఎల్-3  దరఖాస్తులను  పక్కాగా పర్యవేక్షణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర హోసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్  వి.పి.గౌతమ్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణపై  రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్  వీరారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ప్రభుత్వ మార్గ దర్శకాలను హోసింగ్ అధికారులు, ఎంపీడీఓ లకు తెలియజేస్తూ అవగాహన కల్పించారు. ఎల్-1నివేదికలో సొంత ఇంటి స్థలం ఉన్న అర్హులైన లబ్దిదారుల పేర్లు నమోదు చేయాలని, ఎల్-2 నివేదికలో
ఇంటి స్థలం లేనివారి లబ్దిదారుల పేర్లు తీసుకోవాలన్నారు. అర్హులు కాని వారు ఎల్-3 నివేదికలో నమోదు చేయాలన్నారు.
మండలానికి ఒక గ్రామం చొప్పున సేకరించి లబ్దిదారులలో అర్హులైన వారి పేర్లు ఎల్-3లో ఉంటే ఎల్-1లోకి తీసుకోవాలని సూచించారు.
లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా నివేదిక రూపొందించి అందించాలన్నారు.  అనర్హులకు మంజూరు జరిగితే భాద్యులు అవుతారన్నారు. గతంలో మంజూరైన ఇండ్లు పక్కాగా నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేపట్టేందుకు, అదనంగా పెంచుకునేందుకు, ఇంటిపై మరో ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఇవ్వరాదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.