– స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత ..
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ గ్రామంలో 147 సర్వేనెంబర్ భూమిలో, జూన్ 2023 సంవత్సరంలో గత ప్రభుత్వం పేదవారికి ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేసిన వారికందరికీ, స్థలాలను కేటాయించి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ములుగు జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, పొదిల్ల చిట్టిబాబు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కాటాపూర్ లో గతంలో ఇండ్ల స్థలాల పట్టాలు పొందిన పేదవారి తో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుగ్గీ చిరంజీవి, సిఐటియు మండల అధ్యక్షులు చిట్నెనేని శ్రీను ల అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేసి, వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని కాటాపూర్లో గతంలో 2023 వ సంవత్సరంలో 109 మందికి నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసి, వారికి స్థలాలను కేటాయించకుండా, ఇండ్లు నిర్మించకుండా నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కాటాపూర్ లోని ఇండ్ల స్థలాల పట్టాలు పొందిన నిరుపేదలందరికీ వెంటనే స్థలాలను పంచి, రూ.5 లక్షలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వారికి స్థలాలు పంచి ఇస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాటాపూర్లో నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు అందించి, స్థలాలు ఇవ్వకుండా, ఇండ్లు నిర్మించీయకపోవడంతో పేదలు ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని తాసిల్దార్ కు విన్నవించారు. ఉండటానికి ఇల్లు లేక ఎండకు, వానకు, చలికి ఇబ్బంది పడుతూ, సొంతగా ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేక దళితులు, బీసీలు, మైనారిటీ లు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తాసిల్దార్ బాధ గిరిబాబు మాట్లాడుతూ స్థానిక మంత్రి, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో 15 రోజుల్లో, ఈ నెల చివరి వరకు లబ్ధిదారులందరికీ ఎంపీ స్థలాలు పంచిచి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాటాపూర్ శాఖ కార్యదర్శి కాటా నర్సింగరావు, సహాయ కార్యదర్శి ఎర్రోజు సత్యనారాయణ, గృహ నిర్మాణ కమిటీ సభ్యులు అటిక మల్లికార్జున్, బొప్పారపు బాబు, పల్నాటి కృష్ణ, పల్నాటి మహేష్, పయ్యావుల స్వాతి, మడిపెల్లి స్వప్న, పల్నాడు వెంకన్న మురుకుట్ల లక్ష్మి, అధిక శిరీష, 50 మంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.