ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు..

Indiramma's house for every poor person..– ఇందిరమ్మ మోడల్  ఇల్లుకు శంకుస్థాపన 
– మండల అధ్యక్షుడు,మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హుస్నాబాద్ మండల అధ్యక్షులు ,మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కు ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పేదవారి సొంతింటి కల సహకారం చేసే విధంగా ప్రజా పరిపాలన సాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఏడి, మండల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్ రెడ్డి , ఎంపీడీవో  వేణుగోపాల్ రెడ్డి, కుచనపల్లి మాజీ సర్పంచ్ మడప జయపాల్ రెడ్డి, పోలు సంపత్ వెన్న రాజు బూరుగు  కృష్ణ స్వామి  సంఘ కుమార్ , బొంగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.