– బాధితుడికి తీవ్ర గాయాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స
– పరారీలో నిందితులు రంగారెడ్డి జిల్లా మాడ్గుల
– మండలంలో ఘటన
నవతెలంగాణ-మాడ్గుల
యువకుడిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మం డల పరిధిలోని సుద్దపల్లి గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయ పడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. మాడ్గుల సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ నాగరాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆర్కపల్లి గ్రామంలోని దళి త కుటుంబానికి చెందిన పందుల రాములు-సాలమ్మ దం పతుల పెద్ద కుమారుడు పందుల లింగం శనివారం సాయం త్రం 6 గంటల సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉన్నాడు. ింగంను అదే గ్రామానికి చెందిన యాచారం బిక్క య్య అలియాస్ బద్రి తన బైకుపై వచ్చి బయటకు పోదామని పిలిచి బైక్‌పై తీసుకెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో బం ధువులు ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చెందిన సీత, వంశీ, రాములు పందుల లింగం ఇంటికి వచ్చి సుద్ధపల్లి గ్రామ సమీ పంలోని చింత చెట్టు వద్ద బురద మడుగులో రక్తపు గాయాలతో లింగం పడి ఉన్నాడని ఆయన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే లింగం తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని, బురద మడుగులో రక్తపు గాయాలతో పడి ఉన్న లింగంను ఏమి జరిగిందని అడగగా జరిగిన విషయం చెప్పాడు. ‘యాచారపు బిక్కయ్య బైక్‌పై ఇక్కడికి( సుద్దపల్లి చింత చెట్టు ) వద్దకు రాగానే అప్పటికే ఇక్కడ యాచారం జగతయ్య, పందుల బాలరాజు కత్తులతో నిలబడి ఉన్నారు. వెంటనే వెళ్ళిపోదామని వెళ్తండగా.. వెనుక నుంచి జగతయ్య, బాలరాజులు, శ్రీశైలం, బాలయ్య కత్తులతో తనపై విచక్షణ రహి తంగా, కులం పేరుతో దుషిస్తూ దాడి చేశారు. ‘ అని బాధితు డు తల్లిదండ్రులతో చెప్పాడు. వెంటనే బాధితుడి తల్లిదం డ్రు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు గాయాలతో ఉన్న లింగంను మాల్ పట్టణం లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగై న చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. నిందితులు పరారీలో ఉన్నారు. వారు దొరికితేనే దాడికి కారణాలు తెలుస్తాయని సీఐ తెలి పారు. బాధితుడి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నాగరాజు తెలిపారు.