నవతెలంగాణ-గోదావరిఖని
నూతన సంవత్సరం పురస్కరించుకొని గోదావరిఖని ఎల్బీనగర్‌లో గల ఇండో అమెరికన్ స్కూల్ పాఠశాలలో శనివారం ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ హాజరై భారీ కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్నేహపూర్వక వాతావరణం లో ఆటపాటలతో ఆనందంగా గడిపారు. నూతన ఉత్తేజంతో చదువులో మరింత రాణించి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తేవాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నూతన సంవత్సర క్యాలెండర్‌ను జ్ఞాపికగా పంపిణీ చేశారు.