యాచకురాలకి  అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

నవతెలంగాణ – కంటేశ్వర్
ఆనారోగ్యంతో నేటి ఉదయం తులసమ్మ అనే యాచకురాలు (55సంవత్సరాలు) రైల్వే కోటర్స్ వద్ద మృతిచెందింది. అప్పటికే ఆమె మెఖమంత చీమలు, పురుగులుపట్టి ఉన్నాయి. మరణించిన యాచకురాలకి భర్త ఉంండటం తాను యాచకుడు కావటంతో  అంత్యక్రియలు తన భార్యకు చేయలేని పరిస్థితి ఉన్నదని వృద్ధాప్యంతో ఏ పని చేసుకోలేకున్నానని, అనాధలుగా రోడ్లపై ఉంటున్నామని, అంత్యక్రియలు చేయలేని స్థితిలో ఉన్నానని, 3వ ఠాణా ఏస్.ఐ ప్రవిణ్ కి కోరగా వెంటనే 3వ ఠాణా ఏస్.ఐ ప్రవిణ్ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ద్వారా  అంత్యక్రియలు నిర్వహించమని కోరడం వారి పరిస్థితిని వివరించడం జరిగింది. దుబ్బు రోడ్డులోని సార్వజనిక్ స్మశాన వాటికలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారని ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యవర్గం కాసుల సాయితేజ  మద్ది గంగాధర్, జయదేవ్,వినోద్, రాజు, 3వ ఠాణా పోలిస్ సిబ్బంది రఘు తదితరులు పాల్గొన్నారు.