చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

నవతెలంగాణ- నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో మండలంలోని ఒగోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దోరపల్లి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో 50 మంది, చందుపట్ల గ్రామానికి  చెందిన  50 మంది బుధవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో మండల రవీందర్, పెళ్లి నరసయ్య దొరేపల్లి నర్సయ్య, మాధ రాములు, దేశగొని వెంకన్న, అక్కినపల్లి వెంకటయ్య, కట్ల సిద్దు, చిట్టిపాక సైదులు, గోనె సురేందర్, నరేందర్, వద్ది సత్యనారాయణ, టంగుటూరి సాయిలు, వనం యాదయ్య, వద్ది వెంకటేశ్వర్లు, పోల్లగొని నవీన్, గంగుల మల్లయ్య తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ తో పాటు నాయకులు ఉన్నారు.