– సీఐ సంతోష్ కుమార్
నవతెలంగా-తాండూరు
లాడ్జిల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కుంటామని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ అన్నారు. శని వారం తాండూరు పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో పట్టణంలోని వివిధ లాడ్జిల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ..లాడ్జిల నిర్వాహకులతో పలు సూచనలు తెలిపారు. చార్జీ లకు వచ్చే వారికి ఫోటో ఐడెంటిటీ కార్డు, అడ్రెస్స్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్స్ తీసుకొని మాత్రమే లాడ్జిలో రూం అద్దెకు ఇవ్వాలన్నారు. లాడ్జి నిర్వాహకులు కచ్చితంగా రికార్డ్ మెయింటైన్ చేయాలి. సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీకెమెరాలు తప్పని సరిగా పని చేసే విధంగా చూసుకోవాలన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకూ పాల్పడకుండా చూసుకోవాలన్నారు. లార్జీలలో జూదం, మద్యపానం, వ్యభిచారానికి పాల్పడే వారికి రూంలు అద్దెకు ఇవ్వకూడద న్నారు. లాడ్జిలో పనిచేసే వారి ఫోటో అడ్రెస్స్ ప్రూఫ్ కూడా తీసుకోవా లన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. ఈ నిబంధనలు అతిక్రమించిన లాడ్జి నిర్వాహకులపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిబంధనలకు లోబడి లాడ్జీలను నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో వివిధ లాడ్జిల నిర్వాహకులు పాల్గొన్నారు.