– సయ్యద్ మోడీ ఇండియా ఓపెన్
లక్నో: భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ 2024 టోర్నమెంట్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సహచర భారత షట్లర్ ఐరా శర్మపై మూడు గేముల మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది. తొలి గేమ్ 21-10తో నెగ్గిన సింధుకు రెండో గేమ్‌లో ప్రతిఘటన ఎదురైంది. 21-12తో ఐరా శర్మ లెక్క సమం చేసింది. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. 21-15తో యువ షట్లర్‌పై పైచేయి సాధించిన సింధు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు సెమీస్ బెర్త్ కోసం చైనా షట్లర్ వాంగ్‌తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ లక్ష్యసేన్ సైతం క్వార్టర్స్‌లో కాలుమోపాడు. 21-14, 21-13తో డానిల్ (ఇజ్రాయెల్)పై లక్ష్యసేన్ గెలుపొందాడు.