– లగచర్ల ఘటనకు దర్శకుడు కేటీఆర్
– రైతుల ముసుగులో ప్రయివేటు గుండాలు : విలేకరుల సమావేశంలో ఎంపీ మల్లు రవి,
– తెలంగాణ గిరిజన డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) తేజావత్ బెల్లయ్య నాయక్,
– వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మెన్లు కోదండ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
ఫార్మా కాదు ఇండిస్టియల్ ఫార్మా ఏర్పాటు చేస్తారని, లగచర్ల ఘటనకు దర్శకుడు మాజీ మంత్రి కేటీఆర్ అని ఎంపీ మల్లు రవి, తెలంగాణ గిరిజన డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) తేజావత్ బెల్లయ్య నాయక్, వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రణాళిక బద్ధంగా రైతుల ముసుగులో ప్రయివేటు గుండాలు కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగంపై దాడి చేశారని ఆరోపించారు. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, రోటి బాండతాండ, పులిచర్లకుంట తండా గ్రామాలకు అందుబాటులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం నిర్వహిస్తే సభకు రైతులను రాకుండా బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుని సురేష్ అనే వ్యక్తిని అక్కడికి పంపారని అన్నారు. రైతులందరూ లగచర్ల గ్రామాంలోనే ఉన్నారని కలెక్టర్‌కు సురేష్ తెలపడంతో అక్కడికి అధికారులు వెళ్లిన వెంటనే దాడి చేశారంటే బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, నరేందర్ రెడ్డి ప్రణాళికతోనే జరిగిందన్నారు. భూ సేకరణ ప్రాథమిక స్థాయిలోనే ఉండగా బీఆర్‌ఎస్ నాయకులు ఫార్మాసిటీ పెడుతున్నారని ప్రచారం చేసి అక్కడ రైతులను గందరగోళానికి గురి చేశారని తెలిపారు. రెడ్ ఫార్మా కాదని.. గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తామని, దానివల్ల ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. అవసరం ఉన్న దగ్గర ప్రజలకు అవసరమైన పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఇండిస్టియల్ కారిడార్‌గా కొడంగల్ ఎదిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి కషి చేస్తున్నారన్నారు. ఆయా గ్రామాల్లో అసైన్డ్ భూమి ఎక్కువ ఉందని, పట్టా భూమి తక్కువ తీసుకుంటున్నారని అన్నారు. రైతులు అధికారులపై దాడి చేయరని, రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ ప్రయివేటు వ్యక్తులను ఉసిగొల్పిందన్నారు. కలెక్టర్‌ను చంపేందుకు కుట్రపన్నారని, దాంతో ఫైరింగ్ జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతే దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించి రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఆలోచనతో బీఆర్‌ఎస్ కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని, రైతుల ఇష్టంతోనే తీసుకోవాలని సీఎం అధికారులకు చెప్పారని తెలపారు. కొడంగల్ ప్రజలు కేసీఆర్, కేటీఆర్ ట్రాప్‌లో పడొద్దని అన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మెన్‌్ వర్ల విజరు కుమార్. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రశాంత్, దౌల్తాబాద్ మండల అధ్యక్షులు వెంకట్ రావు, బోంరాస్‌పేట్ మండల అధ్యక్షులు నర్సింలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ అంబయ్య గౌడ్. సింగిల్ విండో చైర్మెన్ జయకృష్ణ, కొడంగల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్‌రెడ్డి, మాజీ సర్పంచులు సంజీవరెడ్డి, బాల్ రెడ్డి, శంకర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు సోమశేఖర్, దాము, రాము, రామచంద్ర రెడ్డి, వెంకట్రాములు గౌడ్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.