న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 5.7 శాతానికి పెరిగిందని కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. ఇంతక్రితం జూన్‌లో ఇది 3.7 శాతంగా చోటు చేసుకుంది. 2022 జులైలో 2.2 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఇదే నెలలో గనుల రంగం మైనస్ 3.3 శాతానికి పడిపోగా.. గడిచిన జులైలో ఏకంగా 10.7 శాతం వృద్థిని కనబర్చింది. తయారీ రంగం 3.1 శాతం నుంచి 4.6 శాతానికి చేరింది.