నవతెలంగాణ-ఆత్మకూరు ఎస్
మండల పరిధిలో ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల పట్ల సమాజం చూస్తున్న వివక్ష అసమానతలు నిర్మూలించాలని బుధవారం ఏపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎం.వి ఫౌండేషన్ మండల ఇంఛార్జి వత్సవాయి లలిత మాట్లాడుతూ ఆడపిల్లలపై చిన్నచూపు చూస్తున్న సమాజం, ప్రభుత్వాలు ఉన్నత అధికారులు కుల సంఘాలు మార్పులు తీసుకురావాలని ఆమె కోరారు . ఈ శిక్షణ కార్యక్రమంలో కిశోర బాలిక సంఘాల లీడర్లు , ఎం.వి ఫౌండేషన్ ఆర్గనైజర్స్ నాయిని సైదులు, పుల్లూరు అలివేల ,కే .జయలలిత తదితరులు పాల్గొన్నారు.