అనివార్యం

inevitableద్రౌపది వస్త్రాపహరణం
భారతీయుద్దానికి కారణమైంది
మణిపూర్‌లో కుకీసోదరీమణుల
మానావమానం
మానవత్వాన్ని మారణహోమంలో
మంటగలిపి స్వైరవిహారం చేసిన
కౌరవ సోదరుల
దారుణకృత్యాన్ని సమర్ధించిన
వారు మానవులా – కాదు
దానవ సోదరులు –
ఈ క్రూర నగత్వ ఊరేగింపులను
ఆపి, శిక్షించకపోతే
మరో కురుక్షేత్రం అనివార్యం.
– తాటికొండాల నరసింహారావు, 9885787250