అరచేతిలో ప్రపంచం.. మునివేళ్ల పై సమాచారం.. ఇంకా చెప్పాలంటే సెకనులో పదో వంతులో ప్రపంచ సమాచారాన్ని ఒడిసిపట్టే అవకాశం మన స్వంతం ఇప్పుడు. కానీ, సరిగ్గా.. 34 ఏండ్ల క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. కనీసం పక్క ఊరి విశేషాలు కూడా తెలిసేవి కావు. మనిషి వెళ్లి సమాచారం ఇస్తే తప్ప ఏ విషయం ఇతరులకు తెలిసేది కాదు. ఈ పరిస్థితిని మార్చేసిందీ మూడే అక్షరాలే.
సమాచార విప్లవానికి నాంది పలికింది ఆ మూడు అక్షరాలే షషష. పూర్తిగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ వెబ్. డిజిటల్ కాలంలో ఈ పదం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. షషష కి ఆగష్టు 1వ తేదీతో అంటే నేటికి 34 ఏండ్లు నిండింది. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్ డేగా జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ వెబ్‌ను 1989లో కంప్యూటర్ సైంటిస్ట్ టిమ్ బెర్నర్స్-లీ రూపొందించారు. అప్పటి నుండి ఇది ఇంటర్నెట్ మొత్తం రూపాన్ని మార్చింది.
వరల్డ్ వైడ్ వెబ్ ఎలా పుట్టింది
1989లో స్విట్జర్లాండ్ కు చెందిన టిమ్ బెర్నర్స్ లీ (35) యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (UOFNR)లో సహ పరిశోధకుడిగా పనిచేశాడు. లీ ఇక్కడ ఒక కంప్యూటర్ సిస్టమ్ సమాచారాన్ని మరొక కంప్యూటర్‌కు పంపేవాడు. ఈ సమయంలో సమాచారం అంతా ఒకే చోట లభ్యమయ్యేలా మార్గం ఎందుకు ఉండకూడదని ఆలోచించాడు. దీని తర్వాత, లీ ఇదే అంశంపై ‘ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ – ఎ ప్రపోజల్’ పేరుతో పరిశోధనా పత్రాన్ని సిద్ధం చేశారు. దీని తర్వాత మొదటి వెబ్ పేజీ బ్రౌజర్ వరల్డ్ వైడ్ వెబ్ పుట్టింది. టిమ్ బెర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ కి ఫాదర్ అయ్యాడు. మన ఇంట్లో మనం కూర్చొని రాసే అక్షరం ప్రపంచం మొత్తం సెకన్లలో వెయ్యో వంతు సమయంలో చేరిపోతోంది. ఓ వీడియో.. కళ్ళు మూసి తెరిచే లోపు లోకం చోట్టేసి వచ్చేస్తోందంటే.. అది ఈ www వలనే సాధ్యమైంది.
తాన మిత్రబృందంతో కలిసి ఒక ప్రోటోకాల్ వ్యవస్థ రూపొందించారు. అదే HTTP (Hyper Text Transfer Protocol). ఇది ప్రపంచంలోని అన్ని కంప్యూటర్ సర్వర్లనీ.. క్లయింట్లనీ ప్రామాణిక సమాచార వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చింది. అయితే, దీనిని సామాన్య వాడకంలోకి తీసుకురావడానికి మాత్రం వారికి మరో రెండున్నరేండ్లు పట్టింది. పూర్తి స్థాయిలో 1992 జనవరిలో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే, డిసెంబర్ 1994లో వచ్చిన కొత్త ఆవిష్కరణలతో వరల్డ్ వైడ్ వెబ్ (WWW) తరువాత ఏడాది కల్లా మిలియన్ల మందికి చేరుకుంది. ఇక తరువాత దశాబ్దంలో ఈ సమాచార విప్లవం సాధించిన ప్రగతి మనకందరికీ తెలిసిందే. అయితే, ఈ విప్లవ ప్రగతికి పూర్తి ఆధారం సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1995లో ఇంటర్నెట్ అప్లికేషన్లకి సహాయకారిగా ఉండేలా స్వంత వెబ్ బ్రౌజర్‌ని అభివద్ధి చేసింది. దీనిని విండోస్-95 కి అనుసందానించింది. అంటే విండోస్ కొనుకున్న వినియోగదారునికి షషష సర్వీసులను కూడా కలిపి అందించే వ్యవస్థ రూపొందించింది. అక్కడ నుంచి క్రమేపీ మైక్రోసాఫ్ట్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పటికీ తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ప్రపంచంలో చాలా వెబ్ సైట్ లు షషష తోనే ప్రారంభం అవుతాయి. తరువాత డొమైన్ పేరు వస్తుంది. ఉదాహరణకి.. www.example.com ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. WWW లేకుండా వెబ్ ప్రపంచంతో కలవడం.. అంత సులభం కాదు.
ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ మధ్య తేడా ఏమిటి?
చాలా మంది ఇంటర్నెట్ ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ ఒకే విషయంగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఆన్‌లైన్ పేజీల గ్రూప్, అయితే ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్‌లు, డివైజెస్ కనెక్ట్ చేయబడిన భారీ నెట్‌వర్క్. అంటే, ఇంటర్నెట్ ఒక పెద్ద వేదిక ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో డేటాను అందిస్తుంది.
ఇంటర్నెట్ బ్రౌజింగ్ రోజువారీ పనయ్యింది. ఈ నేపథ్యంలో సురక్షితకూ ప్రాధాన్యం పెరిగింది. బలమైన పాస్‌వర్డ్‌లను సష్టించుకోవటం, వాటిని కనిపెట్టుకొని ఉండటం.. వెబ్ యాక్టివిటీని ట్రాకర్ల కంట పడకుండా చూసుకోవటం.. ఈమెయిల్ స్పామ్‌లను తప్పించుకోవటం.. ఫైళ్లు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవటం నిత్యకత్యంగా మారాయి. ఇంటర్నెట్ బ్రౌజింగ్ రోజువారీ పనయ్యింది. ఈ నేపథ్యంలో సురక్షితకూ ప్రాధాన్యం పెరిగింది. బలమైన పాస్‌వర్డ్‌లను సష్టించుకోవటం, వాటిని కనిపెట్టుకొని ఉండటం.. వెబ్ యాక్టివిటీని ట్రాకర్ల కంట పడకుండా చూసుకోవటం.. ఈమెయిల్ స్పామ్‌లను తప్పించుకోవటం.. ఫైళ్లు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవటం నిత్యకత్యంగా మారాయి. చూడటానికిది పెద్ద పనిగానే అనిపించొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తేలికగానే బ్రౌజింగ్‌ను భద్రం చేసుకోవచ్చు.
ఎప్పుడైనా HTTPS వాడాలి
చాలా వెబ్‌సైట్లు హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్ సెక్యూర్ (హెచ్‌టీటీపీఎస్) కనెక్షన్‌ను అందిస్తాయి. హెచ్‌టీటీపీ కనెక్షన్‌తో పోలిస్తే ఇది చాలా సురక్షితం. బ్రౌజర్‌తో మన కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్ చేయటానికి హెచ్‌టీటీపీఎస్‌ను రూపొందించారు. వెబ్‌సైట్‌లో ఇది డిఫాల్ట్‌గా లేనట్టయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే. కాబట్టి వెబ్ చిరునామా ముందు హెచ్‌టీటీపీఎస్ ఉందేమో నిర్ధారించుకోవాలి. దీనికి తేలికైన మార్గం వెబ్ చిరునామా పక్కన చిన్న గడియారం గుర్తుంటే సురక్షితమనే అనుకోవచ్చు.
క్లిక్ చేసే ముందు జర జాగ్రత్త..
ఇంటర్నెట్‌లో వెతుకుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఏవో ఆసక్తికరమైన లింక్‌లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తోంటాయి. వాటి చూడగానే క్లిక్ చేస్తాం. ఇలాంటి ఉత్సుకతే అనేక చిక్కుల్లో పడేస్తుంది. ఎందుకంటే అది వైరస్‌తో కూడిన డౌన్‌లోడ్ అయ్యుండొచ్చు. నకిలీ వెబ్‌సైట్ కావొచ్చు. లేదూ ఫిషింగ్ కోసమే ప్రత్యేకంగా రూపొందించింది అయ్యుండొచ్చు. అందువల్ల క్లిక్ చేసే ముందు లింకులను నిశితంగా గమనించటం ఎంతైనా మంచిది. బ్రౌజర్ స్టేటస్ బార్‌ను చూస్తే లింకు వెనకాల దాగిన యూఆర్‌ఎల్ కనిపిస్తుంది. దేన్ని క్లిక్ చేస్తున్నామో తెలిసిపోతుంది. కావాలనుకుంటే వెబ్ ఆఫ్ ట్రస్ట్ వంటి ఎక్స్‌టెన్షన్ల సాయం తీసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్‌టెన్షన్లు స్కోర్ల రూపంలో వెబ్‌సైట్ విశ్వసనీయతను తెలియజేస్తాయి. దీంతో అది సురక్షితమో, కాదో ఇట్టే తెలిసిపోతుంది. ‘మీ కంప్యూటర్ ప్రమాదంలో పడింది, వైరస్‌లతో నిండిపోయింది. ఫలానా క్లీనర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా అన్నింటినీ పరిష్కరించుకోండి’ అంటూ కనిపించే ప్రకటనలను నమ్మొద్దు. సామాజిక వేదికల యాప్‌లు, వెబ్‌సైట్లలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడూ జాగ్రత్త పాటించాలి. చిన్న పొరపాటైనా పెద్ద నష్టం కలిగించొచ్చు. ఇంటి లొకేషన్, ప్రయాణ గమ్యం, క్రెడిట్ కార్డు నంబరు వంటి వాటిని బహిరంగంగా ప్రకటించుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.
బ్రౌజర్ అప్‌టుడేట్
బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసినప్పుడు కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్సెస్ అందటమే కాదు.. భద్రత లోపాలు, మాల్వేర్ల నుంచీ రక్షణ లభిస్తుంది. ప్రతి కొత్త అప్‌డేట్‌తో సెక్యూరిటీ ఫిక్సెస్ కూడా లభిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ను తాజా వర్షన్‌కు అప్‌డేట్ చేస్తుండాలి.
వేరే కంప్యూటర్ల మీద ఇన్‌కాగ్నిటో పద్ధతి
ఎక్కువమంది వాడే కంప్యూటర్ మీద ఏదైనా సమాచారాన్ని వెతుకుతున్నప్పుడో, స్నేహితుడి పీసీలో ఈమెయిల్‌ను చెక్ చేస్తున్నప్పుడో బ్రౌజర్‌ను ప్రయివేట్ మోడ్ లేదా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పెట్టుకోవడం మంచిది. ప్రయివేట్ మోడ్‌లో బ్రౌజింగ్ చేసినప్పుడు దాని హిస్టరీ కంప్యూటర్‌లో సేవ్ కాదు. కానీ డౌన్‌లోడ్స్ మాత్రం సేవ్ అవుతాయి. అయితే ప్రయివేట్ మోడ్‌లో బ్రౌజింగ్ చేసినప్పటికీ ట్రాక్ చేసే అవకాశముంటుంది. సొంత కంప్యూటర్‌లోనూ వస్తువుల ధరలు తెలుసుకునేటప్పుడు, వెబ్‌సైట్‌లో రెండో ఖాతాతో లాగిన్ అయ్యేటప్పుడు, సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను కొనేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించటం మంచిది. మన కంప్యూటర్‌ను వేరేవారికి ఇస్తున్నప్పుడు గెస్ట్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవటమూ అవసరమే. దీంతో గెస్ట్ యూజర్‌కు కొన్ని పరిమితులే లభిస్తాయి.
– అనంతోజు మోహనకృష్ణ, 8897765417