నవతెలంగాణ – అశ్వారావుపేట
సమాచార విప్లవకారుడు రాజీవ్ గాంధీయే అని, ఆయన కాలంలోనే టెలికాం రంగం అభివృద్ధికి నోచుకుంది అని కాంగ్రెస్ మండల అద్యక్షుడు మొగళ్ళపు చెన్నకేశవరావు అన్నారు. ఆయన వర్ధంతిని స్థానిక కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రం పటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం నివాళులు అర్పించారు. సాంకేతిక పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. తన తల్లి ఇందిరా గాంధీ, తాను ఉగ్రవాదానికి బలి కావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. అది ఏ ఉగ్రవాదం అయిన సమాజం విచ్చిన్నం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి లు భారతి, తిరుమల బాలగంగాధర్, కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా, దన్జూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.