
నవతెలంగాణ-గోవిందరావుపేట : ప్రస్తుతం నివసిస్తున్న గుత్తి కోయ గూడెంలోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.ఎస్.కె మస్తాన్ అన్నారు. సోమవారం ఎస్ ఐ ఎస్ కె మస్తాన్ సిబ్బందితో కలిసి మండలంలోని మచ్చాపూర్ గ్రామ సమీపంలోని గుత్తి కోయ గుంపు గూడెంను సందర్శించారు. ఈ సందర్భంగా గూడెం వాసులతో ఎస్ ఐ మస్తాన్ మాట్లాడుతూ గుంపులోకి కొత్త గుంపు వచ్చినట్లయితే వెంటనే సమాచారం అందించాలని అపరిచితులకు ఆశ్రయం కల్పించకూడదని అన్నారు. యువత ఉజ్వల భవిష్యత్తు వైపు పయనించాలని చక్కగా చదువుకొని రాణించాలని సూచించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. గ్రామ సమస్యలను గుత్తి కోయాలను అడిగి తెలుసుకున్నారు.