మౌలిక సదుపాయాలు కల్పించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భిక్కనూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కన్వీనర్ కృష్ణ మాట్లాడుతూ భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపిసి కోర్సు లేకపోవడం, సరిపడా భవనాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ప్రహరీ లేకపోవడం ద్వారా పరిసర ప్రాంతాల నుంచి పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకొవడం లేదని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్.ఎఫ్.ఎస్ కామారెడ్డి నగర ఇంఛార్జి సంజయ్, నగర కార్యదర్శి సమీర్, నితిన్, సందీప్, నిషాంత్, రాహుల్, రాజేశ్వరి, రేణుక, వర్ష, నజ్రీన్, తదితరులు పాల్గొన్నారు.