క్రీడామైదానంలో మౌలిక వసతులు కల్పించాలి

– ఆదనవు కలెక్టర్‌పాటిల్‌ హేమంత కేశవ్‌
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
క్రీడా మైదానాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంతకేశవ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లాలో సీఎం కప్‌ నిర్వహణలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగే క్రీడల సందర్బంగా క్రీడామైదానాలను పరిశీలించి మాట్లాడారు.క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని అలాగే క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడతాయన్నారు.ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయిలో క్రీడాపోటీలు విజయవంతంగా నిర్వహించామని తెలుపుతూ ఈ నెల 22వ తేదీ లోపు క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.స్థానికంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వాలీబాల్‌, కోకో, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌ ఇతర క్రీడలు, ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో అథ్లెటిక్స్‌ అలాగే పబ్లిక్‌ క్లబ్‌లో బ్యాడ్మింటన్‌ క్రీడలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ నెల 22 నుండి 24 వరకు నిర్వహించే క్రీడల సందర్బంగా క్రీడామైదానాలను పరిశీలించి వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాలలో క్రీడాకారులు ఇబ్బందిపడకుండా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సురేష్‌, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.