నవతెలంగాణ-నిర్మల్
సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని, సొంత భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులకు సరైన బాత్రూం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హాస్టల్ ప్రారంభమై నెల గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు దోమతెరలు, బెడ్ షీట్లు, ఇతర వస్తువులు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కార్తీక్, రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు.