పెనుకొండలో అమానుషం..!

– మహిళను వివస్త్రను చేసి… జుట్టు కత్తిరించిన వైనం
– ప్రేమ జంటకు సహకరించిందనే నెపంతో దాడి
పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంటకు సహకరించిందన్న కారణంతో ఓ వివాహితను వివస్త్రను చేసి జుట్టు కత్తిరించారు. ఈ సంఘటన పెనుకొండ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలో ఇటీవల ఓ ప్రేమ జంట ఇల్లు వదలి పారిపోయారు. వీరికి అదే గ్రామంలో నివాసముంటున్న మహిళ సహకరించిందనే నెపంతో ప్రేమికురాలి తల్లిదండ్రులు, బంధువులతో పాటు దాదాపు 22 మంది ఆమె ఇంటిపై దాడి చేశారు. చీర లాగి, జుట్టు కత్తిరించారని బాధితురాలు వాపోయారు. ఆమెకు పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కియా ఇండిస్టియల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.