నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాకేంద్రంలో శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్, సూపర్వైజర్ .జీ. శ్రీనివాస్, ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల గెస్ట్ ఫ్యాకల్టీ సుమయ్య సుల్తానా వార్డు నంబర్ 14 సంజయ్ నగర్ కాలనీలో సర్వే ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ సర్వేను మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.