
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ అద్వర్యంలో గ్రామ పంచాయతీ ముందర దర్పల్లి -ఇందల్ వాయి రహదారికి ఆనుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరునగరి శ్రీదర్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతదికారుల ఆదేశానుసారం గ్రామ పంచాయతీ అద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశామని, చలివేంద్రం లో అనునిత్యం ఫిల్టర్ నీళ్లు ఉంచడం జరుగుతుందని, చలివేంద్రం వద్ద నీరు అందించాడని ఒకరిని నియమించామని శ్రీధర్ వివరించారు.వచ్చే పోయే వారికి దాహార్తిని తీర్చడానికి రంజన్ లను పేట్టి చల్లని త్రాగునీరు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో కరోబార్ పిల్లి నరేందర్, సాయిలు తదితరులు ఉన్నారు.