
ముఖ్యమంత్రి మొదలు మంత్రి సీతక్క,కమీషనర్ తదితరులకు గత 11 నెలల కాలం లో పదుల సంఖ్యలో కలిసి వినతి పత్రాలు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఒక రోజు సమ్మె చేశామని, కలక్టరేట్ ల ముందు సుమారు ఆరు సార్లు ధర్నాలు చేశామన్నారు.
సమస్యల పరిష్కారంలో తీవ్ర వివక్ష
విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై మరణించిన, గాయ పడిన కార్మికులకు నష్ట పరిహారం ఇవ్వడం లేదని వాపోయారు. వయసు ఐపోయిందనే పేరుతో కార్మికులను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కుల గణన సర్వే లో సైతం గ్రామ పంచాయతీ కార్మికులను ఉపయోగిస్తున్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, జిల్లాలో మూడు నుండి ఎనిమిది నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయని అన్నారు. ప్రతి పనికి గ్రామ పంచాయతీ కార్మికుడు అవసరమైన ప్రభుత్వానికి కార్మికుడి కుటుంబం, కనీస వేతనం, ప్రమాద భీమా తదితర సమస్యల పరిష్కారంలో తీవ్ర వివక్ష చూపుతున్నదని అన్నారు. ఇదే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే నవంబర్ 20 తర్వాత ఏ క్షణమైనా సమ్మె లోకి వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి.గంగన్న, దుబాక రమక్క, నర్సమ్మ టి.గంగన్న, జిల్లా నాయకులు వాగారావ్, రఫీ, గంగయ్య, దేవుసింగ్, రాజు, వీలాష్, ప్రకాష్, సంతోష్, సూర్య పాల్గొన్నారు.