నీడసంస్థ ఆధ్వర్యంలో మొబైల్ శిక్షణ ప్రారంభం

నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో నీడ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ శిక్షణా కేంద్రాన్ని మంగళవారం ట్రస్టీ మెంబెర్స్ కొండల్‌రావు, కోఆర్డినేటర్ వెంకట్, జాషువా ప్రారంభించారు.అనంతరం కొండల్‌రావు మాట్లాడుతూ..యువతకు శిక్షణ తర్వాత స్వయం ఉపాధి కోసం మొబైల్ శిక్షణ కేంద్రం సహాయం చేస్తుందని,భవిష్యత్తులో మేడిపల్లి గ్రామంలో నీడా సంస్థ ద్వారా మరిన్ని వృత్తి నైపుణ్య శిక్షణలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్వి బిక్షపతి గౌడ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.