కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష

నవతెలంగాణ-నాచారం
నాచారం పాత వార్డు కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ నాచారం డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మేడల మల్లికార్జున్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజల సమస్యలు పట్టని పాలకుల తీరుపై సామాన్యుడి తిరుగుబాటు దీక్ష’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ రాగిడి లక్ష్మారెడ్డి హాజరై దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాచారం డివిజన్‌ లో నెలకొన్న ప్రజల సమస్యల పట్ల పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. నాచారం గ్రామంలో డ్రయినేజీ సమస్య విలయతాండవం చేస్తుంటే పట్టించుకునే వారే లేరన్నారు. పాత వార్డు కార్యాలయాన్ని కూల్చి ఏండ్లు గడుస్తున్నా పునర్నిర్మాణానికి చర్యలు లేవని చెప్పారు. శిధిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రాన్ని కూల్చారు.. తిరిగి నిర్మాణం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘పటేల్‌ కుంట చెరువు సుందరీకరణ పత్తకు లేదు. దోమలు స్వైరవిహారం నివారణకు చర్యలు లేవు. ముస్లింల స్మశాన వాటికకు స్థలం ఇస్తామని హామీ ఇచ్చి హామీని మర్చిపోయారు. అభివద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలకే పరిమితం. ఆచరణలో అన్ని సమస్యలే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుడు సతమతమవుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్‌, యువజన, మహిళ ముఖ్య నాయకులు దీక్షలో కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు భద్రయ్య, శేఖర్‌ గౌడ్‌, శ్రీకాంత్‌ గౌడ్‌, కష్ణారెడ్డి, సంజరు జైన్‌,అబ్దుల్‌ రషీద్‌, హెచ్‌ ఆర్‌ మోహన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, గ్యార కిరణ్‌, నర్సింగరావు, జంగమ అశోక్‌, ఆశన్న, టోనీ ఫ్రాన్సిస్‌, భారతమ్మ, మున్ని బేగం, సుజాత నాయక్‌, సులోచన, లక్ష్మి పాల్గొన్నారు.