– సరిచేసి జిల్లా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి
– ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి
ప్రతినిధిగత ప్రభుత్వం 317 జీవోతో రంగారెడ్డి జిల్లా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని యూటీఎఫ్ జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను అశాస్త్రీయంగా విభజించిందన్నారు. ఈ క్రమంలో జిల్లా ఉపాధ్యాయులు, నిరుద్యోగులు 317జీవో కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. సీనియార్టీ, వివిధ కారణాల పేరుతో అక్రమంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన వారి సంఖ్య ఇప్పుడు పని చేస్తున్న క్యాడర్ స్ట్రెంత్ కంటే కూడా ఎక్కువ మంది ఉపాధ్యాయులను కేటాయించారన్నారు. ఫలితంగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పని చేస్తున్న టీచర్లకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ శాస్త్రీయ విధానంతో రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, కోశాధికారి జగన్నాథ్ శర్మ పాల్గొన్నారు.