కాంగ్రెస్ పాలనలో అంగన్వాడీ లకు అన్యాయం : సీఐటీయూ నాయకులు అర్జున్

నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చు తాము ఆని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను తుంగలో తొక్కిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ విమర్శించారు.  గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో నిర్వహించిన సీఐటీయూ అనుబంధ తెలంగాణ  అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం మినీ అంగన్వాడీ సెంటర్లను అప్ గ్రేడ్ చేసి వాటిల్లో పనిచేసే అంగన్వాడీ టీచర్స్ కు మాత్రం జీతాలు పెంచకపోవటం బాధాకరమన్నారు.అంగన్వాడీ సెంటర్ లలో టీచర్స్,హెల్పర్స్ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని,కానీ సమస్యలను పరిష్కరించాల్సిన సీడీ పీవో,సూపర్వైజర్లు మాత్రం ఆ సమస్యలను పట్టించుకోకుండా పేపర్లలో ప్రచురితం అయిన వార్తలు బూచి గా చూపుతూ అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆ సమస్యలను మరింత జటిలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.కేంద్రాల్లో సౌకర్యాలు లేమికి  అధికారులే భాద్యత వహించాలని డిమాండ్  తెలిపారు.  విధులలో ఉన్న అంగన్వాడీ  టీచర్స్ పై దాడులు జరుగుతున్నా ఆ దాడులు ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరించటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు.ప్రభుత్వం అంగన్వాడి సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకులు రాధ,నాగమణి, క్రిష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.