జీవో 46తో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అన్యాయం

– పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
జీవో 46తో గ్రామీణ ప్రాంతాల పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అన్యాయం జరుగు తుందని పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ప్రజావాణి కార్యక్రమంలో డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ తెలంగాణలోని 24 , 25 జిల్లాల నుంచి పోలీస్‌ కానిస్టేబుల్‌ మెరిట్‌ అభ్యర్థులు జీవో 46 వల్ల నష్టపోయామని తమ గోడును విన్నవించేందుకు అన్ని జిల్లాల నుండి సుమారు 1600 మంది మంత్రినీ కలిశారు. టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ను భర్తీ చేశారో అదేవిధంగా 2022-23 నోటిఫికేషన్‌లో కూడా టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా గ్రామీణ ప్రాంతా అభ్యర్థులు విన్నవించుకున్నారు. ఈ సమస్య పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి సమస్య యొక్క తీవ్రతరం చాలా ఎక్కువగా ఉందని దీన్ని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న సంబం ధిత అధికారులకు ఆదేశించారని తెలిపారు. ఈ జీవో 46తో అన్ని గ్రామీణ జిల్లాల అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఈ సమస్యపై అన్యాయం జరిగిన అభ్యర్థులను న్యాయం చేకూర్చే విధంగా అక్కడ ఉన్న అధికారులను ఈ జీవో 46ని త్వర తగతిన పరిగణలోకి తీసుకొని పరిష్కారం చేయ వలసిందిగా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.