విద్యారంగానికి అన్యాయం..

Injustice to the education sector..– యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
నవతెలంగాణ-  డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 21292 కోట్లు (7.31%)మాత్రమే కేటాయించారని విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని పి.డి.ఎస్.యూ తెలంగాణ యూనివర్సిటీ నాయకులు రవీందర్ ,అక్షయ్ లు అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ముందు పిడి ఎస్ యు యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో  విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని , కానీ బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించ కపోవడం సిగ్గుచేటని , ఇప్పటికైనా బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలో వీసీ నియమకాలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని , మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఆకాష్, అర్జున్, మోహిత్,రాజ్ కుమార్, యశ్వంత్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.