నవతెలంగాణ – మద్నూర్
వ్యవసాయ రైతులు పండించిన పంటలకు సరైన ధరలు సరైన మందులు విత్తనాలు లభించాలంటే రైతులంతా ఐక్యమత్యంగా ఉన్నప్పుడే రైతుకు జరిగే అన్యాయాలను అరికట్టవచ్చని మండల కేంద్రంలోని ఎఫ్ పి ఓ రైతు సంఘం అధ్యక్షులు చాట్ల గోపాల్ అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఎఫ్ పి ఓ కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆయన ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మద్నూర్ మార్కెట్ యార్డులో సోయా పంట కొనుగోలు జరగకపోవడం అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. పంటను అమ్ముకునేందుకు రైతులు మద్నూర్ మార్కెట్ కు తీసుకువచ్చిన సోయా పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రం ఈనెల ఏడవ తేదీతో మూసివేయడం దాదాపు వేలాదికుంటలా సోయా పంట కొనుగోలు జరగక రైతులకు అన్యాయమే జరిగిందని, దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన తెలిపారు. రైతులంతా ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఎఫ్ పి ఓ కమిటీ సభ్యులు రైతులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.