‘నవోదయం’

'నవోదయం'ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇది!
కొత్తగా తెల్లారినా కొత్త పొద్దు కోసం
కోటి ఆశలతో ఉత్కంఠ భరిత
మనసుల్ని గుప్పిట బిగించి
ఎన్నికల రణక్షేత్రానికి తరలి
వస్తున్నారంతా

సిబ్బంది పోలింగ్‌ సామాగ్రి
సిద్ధం చేసుకొంటుంటే
సీలు వేసిన ఇనుప బ్యాలెట్‌
బాక్సులు శూన్యాన్ని కండ్లుగా
చేసికొని ఖాళీ పొట్టలతో
ఆవురావురంటున్నాయి.
రాలే ఓటు ఫలాల కోసం
ఎదురుచూస్తున్నాయి!
డబ్భై ఏడేండ్ల స్వేచ్ఛా విహంగం
ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే
వంకర టింకర
అపభ్రంశ ముళ్లబాటల
పయనంలో వెనుకబాటు,
గాయాల ఆనవాళ్లే
ఎక్కువ వెక్కిరిస్తున్నాయి..
పాత తప్పిదాలకు పాతరేసే
సరైన సమయమిదే!

బాధ్యతగల రాజకీయాలకు
నిస్వార్ధప్రజాఆకాంక్షలు తోడైతే
బ్యాలెట్‌ బాక్సుల్లో
వెలుగులు చిమ్ముతూ
మనం కలలుగనే
నవభారతం
తప్పక ఉదయిస్తుంది..!!
– భీమవరపు పురుషోత్తమ్‌
 సెల్‌ : 9949800253