ఏకే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్ పారు’. తాజాగా ఈ చిత్ర పోస్టర్ లాంచ్ వేడుక చాలా వినుత్నంగా జరిగింది. ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసే డెలివరీ బార్సు చేతుల మీదుగా ఈ లాంచ్ జరగడం విశేషం. తమ విలువైన సమయాన్ని పోస్టర్ అవిష్కరణకు వినియోగించి నందుకు చిత్ర యూనిట్ డెలివరీ బార్సుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందరి ఆకలి తీర్చడానికి డెలివరీ బార్సు ఎంతో కష్టపడుతూ.. ఎండ, వాన అని తేడా లేకుండా సమయానికి ఫుడ్ అందిస్తున్నారు. వారి శ్రమకు ‘దేవ్ పారు’ టీమ్ ఒక చిన్న ట్రిబ్యూట్‌ను ప్లాన్ చేశారు. అందుకని ఒక డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆ ఆర్డర్ తీసుకొచ్చిన డెలివరీ బార్సుతో పోస్టర్ లాంచ్ చేశారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు, త్వరలోనే మరో సాలిడ్ అప్డేట్‌తో వస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.