సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక స్థానిక మూడు రోడ్ల కూడలి లో సోమవారం ముఖ్యమంత్రి ని సంబోధిస్తూ సారూ జర మా గోస వినుండ్రీ… అంటూ ఒక బ్యానర్ ను ఏర్పాటు చేశారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు అందరిని రెగ్యులర్ చేయాలని వివిధ డిపార్ట్మెంట్ ల వారిని రెగ్యులర్ చేసి తమను రెగ్యులర్ చేయడం విస్మరించారని, రెగ్యులర్ చేసేంత వరకూ కనీసం టైం స్కేలు నైనా మంజూరి చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పిలు ప్రభాకరాచార్యులు, మాళోతు రామారావు, రాజు, నాగేశ్వరరావు, హనుమంతు, మల్లేష్, జ్యోతి, సి.సి.ఒ మహబూబ్, యం.ఐ.యస్ రమేష్, .ఐ.ఇ.ఆర్.పిలు రామారావు,లక్ష్మి,మెసెంజర్ శ్రీను, కేర్ గివర్ రమణ తదితరులు పాల్గొన్నారు.