వినూత్న కథ, కథనాలు..

Innovative stories.సత్యం రాజేష్‌, డా.కామాక్షి భాస్కర్ల హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మా ఊరి పొలి మేర-2’. గౌరు గణబాబు సమర్పణలో గౌరికష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ప్రముఖ పంపిణీదారుడు వంశీకష్ణ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాత్రల పరిచయ కార్యకమ్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రంలో కనిపించే పాత్రల గెటప్‌లతోనే సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల, రాకేందు మౌళి, బాలాదిత్య తదితరులు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా సత్యం రాజేష్‌ మాట్లాడుతూ,’కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకెళ్తుంది’ అని తెలిపారు. ”పొలిమేర -1’కు మించి 20 రెట్లు బాగుంటుందీ సినిమా. త్వరలో ‘పొలిమేర -3′ పనులు మొదలుపెడతాం’ అని దర్శకుడు చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ,’వంశీ నందిపాటి సహకారంతో చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.