నవతెలంగాణ హైదరాబాద్: ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన ఒక ఉత్తేజకరమైన మరియు ఇంటరాక్టివ్ సైన్స్ ఫెస్టివల్ ‘ది సైన్స్ ప్లేగ్రౌండ్’ను నిర్వహించినట్లు ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ వెల్లడించింది. ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమం విజ్ఞానశాస్త్రంలోని అద్భుతాలను సరదాగా, ఆకర్షణీయంగా అన్వేషించడానికి చిన్నారులను ఆహ్వానించింది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కార్యక్రమాలు , వర్క్‌షాప్‌లు మరియు ఆహ్లాదకరమైన ప్రయోగాలపై దృష్టి సారిస్తూ, ఈ కార్యక్రమం పిల్లలకు మరియు వారి కుటుంబాలకు సంతోషకరమైన అనుభూతిని కలిగించింది. మాల్ యొక్క అట్రీయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్సుకతను రేకెత్తించడం మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడం వంటి అనేక రకాల కార్యకలాపాలు భాగంగా ఉన్నాయి . స్నేక్ బబుల్స్ తయారు చేయడం, సెల్ఫ్ ఇన్‌ఫ్లేటింగ్ పప్పెట్‌ను రూపొందించడం మరియు డబ్బా రాకెట్‌లతో ప్రయోగాలు చేయడం వంటి వివిధ రకాల డిఐవై సైన్స్ ప్రాజెక్ట్‌లలో లీనమైన చిన్నారులలో అంతర్గత ఐన్‌స్టీన్‌ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అన్ని వయసుల వారికి సుసంపన్నమైన అనుభవం అందిస్తూనే , పిల్లలకు సైన్స్ మరియు ఆవిష్కరణపై లోతైన ఆసక్తిని పెంపొందించడంలో సహాయపడింది. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ ఎల్లప్పుడూ కుటుంబ వినోదం కోసం ఒక గమ్యస్థానంగా ఉంది మరియు ‘ది సైన్స్ ప్లేగ్రౌండ్’తో పిల్లలకు మరియు కుటుంబాలకు మరపురాని అనుభవాలను అందించాలనే దాని నిబద్ధతను కొనసాగించింది.