నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వం ఆసుపత్రిలో ఏపుగా పెరిగిన చెట్లను నరికివేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ జరిపారు. ఆదివారం రోజు ఆసుపత్రి ఆవరణలో ఉన్న చెట్లను నరికి వేసిన విషయం పత్రికల్లో ప్రచురితమయ్యాయి. దీంతో అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ గుగ్లవాత్ నంద్యానాయక్, బీట్ ఆఫీసర్ కృష్ణ సోమవారం విచారణ జరిపారు. నరికి వేసిన చెట్లను పరిశీలించి కొలతలు సేకరించారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఆసుపత్రి వారి కి నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం.