– 8 మంది ఎంపీలను మరచిన ప్రభుత్వం
– మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్
నవతెలంగాణ నసురుల్లాబాద్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నసూరుల్లాబాద్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్న సంగతి బిజెపి ప్రభుత్వం మర్చిపోయిందని. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్ లో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయని. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో ఉన్న రాష్ట్రంలక లేక కేవలం బిహార్, ఏపీ రాస్ట్రాలకేనా అంటూ ప్రశ్నించారు. ఏపీలో అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు. వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. బిహార్ లో రోడ్డు ప్రాజెక్టులకు రూ. 26 వేల కోట్లు కేటాయించారని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించాలంటూ తగిలిన అభివృద్ధికి బిజెపిలు సహకరించాలని కోరారు. వీరి వెంట మాజీ ఎంపీపీలు శ్యామల శ్రీనివాస్, పాల్త్య విఠల్, నాయకులు ప్రతాప్ సింగ్ రాము తదితరులు పాల్గొన్నారు.