ఆస్పత్రిలో కలెక్టర్ అన్ని విభాగాల పరిశీలన

Inspection of all departments of the Collector in the hospital– అంబేద్కర్ నగర్ పీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పీ.హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని డాక్టర్ కృష్ణవేణి ని అడుగగా, మొత్తం 34 లక్ష్యం కాగా, ఇప్పటిదాకా 24 పూర్తి చేశామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.