కాటాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ తనిఖీ..

నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ములుగు జిల్లా ఎన్పీడీసీఎల్ డి ఈ పులుసం నాగేశ్వరరావు మంగళవారం తనీఖీ చేశారు. సబ్ స్టేషన్ లోని విద్యుత్ బ్రేకర్లను పరిశీలించారు. సంబంధిత రికార్డులను, విద్యుత్ యూనిట్ల వాడకాన్ని చూశారు. వ్యవసాయ రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. లో వోల్టేజీ సమస్య లేకుండా గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలన్నారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు, జేఎల్ఎం హరీష్,కట్టర్ దేవరకొండ రాజు, ఆపరేటర్ విజేందర్ లు ఉన్నారు.