
నవతెలంగాణ – చండూరు
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని సీజనల్ వ్యాధులు, జ్వర సంబంధ కేసులను గురించి మండల వైద్యాధికారి డాక్టర్ మాస రాజును అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.ఆయన వెంట డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ సంధ్య బ్లేస్సి, సూపర్వైజర్లు ఝాన్సీ, విజయ మరియు ఆస్పత్రి సిబ్బంది లక్ష్మి, వెంకన్న ,పద్మ, రజని, సతీష్ తదితరులు ఉన్నారు.