
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల పరిధిలోని పెరుకబండ గ్రామంలో కూలిన ఇండ్లను మంగళవారం మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులు ఆధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి పరిశుభ్రత పాటిస్తూ,మధ్యాహ్న భోజనం నాణ్యత పాటించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,ఏఎంసీ డైరెక్టర్ బండిపల్లి రాజు, నాయకులు జెల్లా ప్రభాకర్ తదితరుు ఉన్నారు.